దేశమంటే --------------- దేశమంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ ఆ మనుషులందున్న నికృష్టుల చెప్పగా మరచెన్ పూర్వ మెపుడో పుణ్యపురుషులు పుట్టినారట పూజనీయులు నేడు పుట్టిరి నీతి బాహ్యులు భూమి భారముగా పుట్టి ప్రజాజీవిత మందు మనగా పూని తహతహలాడు వారే మంచి యన్నది మాయమైనది రాజకీయములో కోరి కూర్చుని తినుటె యెరిగిరి కాయకష్టము సేయు వారలు కరవు పుడమిని , వెగటు గల్గును నేటి మనుషులలో తేలికగ అనృతము లాడుటలె మోసమును నమ్మి బతుకుటలే ఎట్ల సంపాదించినది గా దెంత యన్నదె మిన్నయందురు దేశమంటే మట్టిగాదోయ్ దేశమంటే మనుషులోయ్ ఈ పనికిరాని మనుషులోయ్ ఇంత ఘన దరిద్రులోయ్
ఏ పాదములను సేవించ నిశ్చింతగా జనుల జీవితములు సాగిపోవు ఏ పాదముల్ యిల కేడుగడయయి ధ ర్మమ్ము నిల్ప నవతరణము దాల్చె ఏ పాదముల స్పర్శ ఈ భరత యవనిన్ పరమ పావనగాగ విరియ జేసె ఏ పాద ధూళికై యిలను పెక్కేడులు నిరతము మునులు ధ్యానించి గనిరి అట్టి పరమాత్మ పాదము లందు , పూని మనసు నిల్పితి నీ జన్మ మందు , నడుగొ ! కృష్ణ పరబ్రహ్మ , గోపికా బృంద సహిత రాస కేళీ వినోద విలాసనముల .
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి