ముకుందు స్థితి మనలోనే లింక్‌ను పొందండి Facebook Twitter Pinterest ఈమెయిల్ ఇతర యాప్‌లు సెప్టెంబర్ 04, 2024 అంతర్యామిని కనుగొననంతట వెదికేరు , కృష్ణు డడుగో ! యెదలోచెంతనె కొలువై యుండెడు ,చింత దొరంగుడు , ముకుందు స్థితి మనలోనే . లింక్‌ను పొందండి Facebook Twitter Pinterest ఈమెయిల్ ఇతర యాప్‌లు కామెంట్లు
భక్తుల పాద రజము ..... ఆగస్టు 30, 2024 పద్మసంభవదేవి బాహుబంధమ్ముల నలరు శ్రీకృష్ణుని చెలువు వొగిడి , సత్యా వసంతుని సరస సల్లాపాల ప్రణయ గాధల చెలువార తనిసి , రాధికా రమణి చేరంగ రాసక్రీడ సలిపిన మధుర ప్రసంగము విని , బృందావన విహార ప్రియసమాగమ వినుత రస పిపాస విథము దెలిసి , విష్ణు సంకీర్తనా చార్య విమల మతులు , చేరి , వసుదేవ సుతుని , నోరార , పాడి , ఆడుదురు , అట్టి భక్తుల , అమల పాద రజము దొరికిన చాలును , బ్రతుకు పండు . మరింత చదవండి
ఎందరో కృష్ణభక్తులు..... సెప్టెంబర్ 01, 2024 గీత గోవిందము , కృష్ణ రాధా తత్వ రసమయ కావ్యమై , రాణ కెక్కె భాగవతము , కృష్ణ పరబ్రహ్మ , పరమాత్మ తత్వమున్ , తెలుగుల తలల నిల్పె పలు మువ్వగోపాలపదములు , తెల్గు నే లను , కృష్ణ మోహనాలను దృశించె సంకీర్త నామృత , ఝరు లెన్నొ దెచ్చెను వాసుదేవుని , తెల్గు వాకిటికిని ఎందరో కృష్ణ భక్తులు యెదల నిల్పి మధుర భక్తితో అచ్యుతు నరసి కొలిచి సుగతి బడసిరి , నేనును చూరగొనెద , కృష్ణ దామోదరు వొగిడి , కేలు మొగిడి . 🙏 మరింత చదవండి
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి