అచ్యుతా ! నాకు నువ్వన్న , అద్భుతమ్ము లింక్‌ను పొందండి Facebook X Pinterest ఈమెయిల్ ఇతర యాప్‌లు సెప్టెంబర్ 03, 2024 నాకు నువ్వన్న ప్రేమ , కృష్ణా హరీశ !నాకు నువ్వన్న మధుసూధనా ! జిగీష ,నాకు నువ్వన్న భక్తి , అనంతశయన !అచ్యుతా ! నాకు నువ్వన్న , అద్భుతమ్ము . లింక్‌ను పొందండి Facebook X Pinterest ఈమెయిల్ ఇతర యాప్‌లు కామెంట్లు
భక్తుల పాద రజము ..... ఆగస్టు 30, 2024 పద్మసంభవదేవి బాహుబంధమ్ముల నలరు శ్రీకృష్ణుని చెలువు వొగిడి , సత్యా వసంతుని సరస సల్లాపాల ప్రణయ గాధల చెలువార తనిసి , రాధికా రమణి చేరంగ రాసక్రీడ సలిపిన మధుర ప్రసంగము విని , బృందావన విహార ప్రియసమాగమ వినుత రస పిపాస విథము దెలిసి , విష్ణు సంకీర్తనా చార్య విమల మతులు , చేరి , వసుదేవ సుతుని , నోరార , పాడి , ఆడుదురు , అట్టి భక్తుల , అమల పాద రజము దొరికిన చాలును , బ్రతుకు పండు . మరింత చదవండి
ఏ మనుభవించె కృష్ణయ్య ..... సెప్టెంబర్ 13, 2024 ఏ మనుభవించె కృష్ణయ్య , భూమి పైని , పుట్టుకా , చెఱసాలలో , యెట్టు లెటులొ గొల్ల లిండ్లను బెరిగె , మేనెల్ల యాల ధూళి దూసరితమయి దులకిసపడ . మేనమామ శత్రువయి యేమేమొ చేసె తనను చంపించ , తలిరాకు తనమునందె గదిసి పోరాడ వలసె , రాకాసి గమిని , యేరికైనను నిట్టి రాయిడులు గలవె ! ఆల గాచెను , మన్నుల రాల విపిన తలములన్ , యెండ లనక , వాన లన కకట ! అలసి సొలసి , కఠిన వృక్షముల మొదలుల నిద్దురోయెను , ముద్దు మో మద్దె మురికి . రాచపుటక బుట్టె , మధుర రస విరాజ మాన , పంచభక్ష్యంపు సమ్మాన భోజ నమ్ము లేవి ? వెన్నలకు ప్రాణమ్ము లూన , గొల్ల లిండుల గోరాడె , గోస బడియె . రాధతో గూడి , యమునా తటీ , ధరాది తల , లతా నికుంజముల , నితాంత ప్రణయ జలధి , మునిగిన తన ప్రేమ ఫలిత మేమి ? తుదకు యెడబాటె మిగిలెను , యెద బొగిలెను . కడకు , కొడుకుల గోల్పడి , కడుపు రగిలి ఇంతకును కారణమ్ము ' నీవే ' యటంచు , పూని గాంధారి శపియించె , మునిగె నీట ద్వారకాపురి యాదవుల్ పడిరి చచ్చి . ఇన్నియును ముందె తెలిసియు , మిన్నకుండె , తను పరమాత్మ యయ్యును , ధరణి పూని ధర్మమును నిల్ప అవతారధారి యైన కృష్ణ పరమాత్మ , తప్పునే ! కర్మ ఫలము ! యదా ... మరింత చదవండి
ఎందరో కృష్ణభక్తులు..... సెప్టెంబర్ 01, 2024 గీత గోవిందము , కృష్ణ రాధా తత్వ రసమయ కావ్యమై , రాణ కెక్కె భాగవతము , కృష్ణ పరబ్రహ్మ , పరమాత్మ తత్వమున్ , తెలుగుల తలల నిల్పె పలు మువ్వగోపాలపదములు , తెల్గు నే లను , కృష్ణ మోహనాలను దృశించె సంకీర్త నామృత , ఝరు లెన్నొ దెచ్చెను వాసుదేవుని , తెల్గు వాకిటికిని ఎందరో కృష్ణ భక్తులు యెదల నిల్పి మధుర భక్తితో అచ్యుతు నరసి కొలిచి సుగతి బడసిరి , నేనును చూరగొనెద , కృష్ణ దామోదరు వొగిడి , కేలు మొగిడి . 🙏 మరింత చదవండి
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి