శ్రీకృష్ణ సత్య

 హరికి పన్నీట నభ్యంగనము వెలార్చి ,

పరిమ ళాగరు ధూప పసదు వేసి ,

పసిడి పుట్టము గట్టి , పచ్చని పైపంచ

పచ్చడంబు భుజము పైన వేసి ,

ముత్యాల పేరులు మురువుగా దిగిసిన

వజ్రాల మకుటము వలను గూర్చి 

పచ్చకప్పురపు సొబగులు పైనలదిన 

తిరుమణి నుదుటిపై తీర్చి దిద్ది , 


తలకు శిఖిపింఛ మొకప్రక్క వెలయ జేసి ,

జన్మ జన్మల నిటువలె , జలజ నాభు

తనువు , కైసేయు భాగ్యము , తనకె కలుగ

పతిని వరమడిగెను సత్య ,  పరమ పూజ్య .


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

భక్తుల పాద రజము .....

ఏ మనుభవించె కృష్ణయ్య .....

ఎందరో కృష్ణభక్తులు.....