ఎందరో కృష్ణభక్తులు.....

 గీత గోవిందము , కృష్ణ రాధా తత్వ

రసమయ కావ్యమై , రాణ కెక్కె

భాగవతము , కృష్ణ పరబ్రహ్మ , పరమాత్మ

తత్వమున్ , తెలుగుల తలల నిల్పె

పలు మువ్వగోపాలపదములు , తెల్గు నే

లను , కృష్ణ మోహనాలను దృశించె

సంకీర్త నామృత , ఝరు లెన్నొ దెచ్చెను

వాసుదేవుని ,  తెల్గు వాకిటికిని 


ఎందరో కృష్ణ భక్తులు యెదల నిల్పి

మధుర భక్తితో అచ్యుతు నరసి కొలిచి

‌సుగతి బడసిరి , నేనును చూరగొనెద ,

కృష్ణ దామోదరు వొగిడి ,  కేలు మొగిడి . 🙏


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

భక్తుల పాద రజము .....

ఏ మనుభవించె కృష్ణయ్య .....