ఏ మనుభవించె కృష్ణయ్య , భూమి పైని , పుట్టుకా , చెఱసాలలో , యెట్టు లెటులొ గొల్ల లిండ్లను బెరిగె , మేనెల్ల యాల ధూళి దూసరితమయి దులకిసపడ . మేనమామ శత్రువయి యేమేమొ చేసె తనను చంపించ , తలిరాకు తనమునందె గదిసి పోరాడ వలసె , రాకాసి గమిని , యేరికైనను నిట్టి రాయిడులు గలవె ! ఆల గాచెను , మన్నుల రాల విపిన తలములన్ , యెండ లనక , వాన లన కకట ! అలసి సొలసి , కఠిన వృక్షముల మొదలుల నిద్దురోయెను , ముద్దు మో మద్దె మురికి . రాచపుటక బుట్టె , మధుర రస విరాజ మాన , పంచభక్ష్యంపు సమ్మాన భోజ నమ్ము లేవి ? వెన్నలకు ప్రాణమ్ము లూన , గొల్ల లిండుల గోరాడె , గోస బడియె . రాధతో గూడి , యమునా తటీ , ధరాది తల , లతా నికుంజముల , నితాంత ప్రణయ జలధి , మునిగిన తన ప్రేమ ఫలిత మేమి ? తుదకు యెడబాటె మిగిలెను , యెద బొగిలెను . కడకు , కొడుకుల గోల్పడి , కడుపు రగిలి ఇంతకును కారణమ్ము ' నీవే ' యటంచు , పూని గాంధారి శపియించె , మునిగె నీట ద్వారకాపురి యాదవుల్ పడిరి చచ్చి . ఇన్నియును ముందె తెలిసియు , మిన్నకుండె , తను పరమాత్మ యయ్యును , ధరణి పూని ధర్మమును నిల్ప అవతారధారి యైన కృష్ణ పరమాత్మ , తప్పునే ! కర్మ ఫలము ! యదా ...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి